Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ-కల్లూరు
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటం కోసం సోమవారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ కల్లూరులో పర్యటించనున్నారు. మంత్రుల పర్యటన విజయవంతం చేయటం కోసం జడ్పిటిసి కట్ట అజరు కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మినీ స్టేడియం గ్రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ ఆత్మ సమ్మేళన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రుల పర్యటన సందర్భంగా కల్లూరుని టిఆర్ఎస్ జండాలతో అలంకరించారు. శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎన్ఎస్పిస్ రోడ్లో జలవనురుల శాఖ సర్కిల్ కార్యాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొంటారు. జిల్లా జిల్లా ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే వెంకట వీరయ్య శాఖ అధికారులు పాల్గొంటారు. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరుగు టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లను జడ్పిటిసి కట్టా అజరు కుమార్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, మండల సెక్రెటరీ కొరకొప్పు ప్రసాద్, ఏఎంసి డైరెక్టర్ కట్టా అర్లప్ప, నాయకులు మేకల కృష్ణ, రాచమళ్ళ నాగేశ్వరరావు, నీలాద్రి డైరెక్టర్ భానోత్ బాలు, పాలడుగు శంకర్ రావు,.బి.వి పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.