Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె శిబిరాన్ని ప్రారంభించిన బార్ అధ్యక్షులు దేవదానం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు ఏర్పాటుచేసిన ఐకేపీ, వీఓఏల దీక్షలను ఏడవ రోజు ప్రారంభించిన బార్ అసోసియేషన్, ప్రెసిడెంట్ కోట దేవదానం మాట్లాడుతూ గత ఏడు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన దీక్ష నిర్వహిస్తున్న మహిళలను అభినందిస్తూ వారి న్యాయమైన డిమాండ్లైను కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, సేర్బు ఉద్యోగులుగా గుర్తించాలని, ఐడీ కార్డులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, 10 లక్షల బీమా పథకాన్ని మంజూరు చేయాలని ఇతర డ్యూటీల నుండి తొలగించాలని, వారి డిమాండ్లు న్యాయమైనవని కావున ప్రభుత్వం ఆలోచించి వాటిని త్వరగా పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పడిసిరి శ్రీనివాసు, పి.తిరుమల రావు పాల్గొన్నారు. టీజేఎస్ నాయకులు సంఘీభావం తెలియజేశారు. డీవైఎఫ్ఐ నాయకులు పి.సంతోష్, డి.సతీష్, పి.ప్రేమ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో వీవోఏ అధ్యక్ష కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్రలీల, సభ్యులు, రమాదేవి, జానకి, నాగిని, సీతారత్నం, సీఐటీయూ నాయకులు, నాగరాజు లక్ష్మణ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.