Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 16 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 16 లక్షల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.భగవాన్ రెడ్డి, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పోడియం, ముత్యాలమ్మ, సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీటీసీ వంశీకృష్ణ, పార్టీ నాయకులు శ్రీనివాస్, సోహైల్ పాషా, సానికొమ్ము శంకర్ రెడ్డి, నరేందర్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.