Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్ రేగా కాంతారావు
నవతెలంగాణ-బూర్గంపాడు
వీవోఏల సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం బూర్గంపాడులో విప్ రేగా, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలతలకు ఐకేపీ, వీఓఏల సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా సమ్మె శిబిరం వద్ద సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య మాట్లాడుతూ వీవోఏల సమ్మెకు ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. వీవోఏలకు కనీస వేతన రూ.26000 ఇవ్వాలని ఆయన అన్నారు. అర్హులైన వివోఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమలాబి, పోషమ్మ, వసంత, పాపారావు, గుండి వీరస్వామి, శ్రీలక్ష్మి, పద్మావతి, దుర్గ, సుధారాణి, వెంకటలక్ష్మి, శివపార్వతి, సైదమ్మ, కృష్ణవేణి, నిర్మల, గౌతమి, తదితరులు పాల్గొన్నారు.