Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి
- సోషల్ ఆడిట్ గ్రామ సభ సందర్భంగా వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి
నవతెలంగాణ-భద్రాచలం
గత సంవత్సరం ఉపాధి పనులు చేసిన కూలీలకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, భద్రాచలం పంచాయతీ పరిధిలో ఉపాధి కూలీలకు కొత్తగా పనులు చూపించాలని, ఉపాధి పథకం అమలుపై పంచాయతీలోని అన్ని మారుమూల కాలనీలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ కార్యక్రమం సందర్భంగా జరిగిన గ్రామసభ సందర్భంగా అధికారులకు వినతిపత్రం అందించి, మాట్లాడారు. గత సంవత్సరం ఉపాధి పనులు చేసిన కూలీలకు బిల్లులు చెల్లించలేదని, ఆనాటి టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉన్న అధికారి తప్పిదం వల్ల ఉపాధి కూలీలకు డబ్బులు రాలేదని ''అధికారి తప్పు చేస్తే కూలీలు శిక్ష అనుభవించాలా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఈ అంశంపై సోషల్ ఆడిట్ సభలో అధికారులను అడగగా తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మండల స్పెషల్ అధికారి నాగలక్ష్మి, పంచాయతీ ఈవో వెంకటేశ్వరరావులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తూము రాదా, జ్యోతి, రమణ తదితరులు పాల్గొన్నారు.