Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ పాల్వంచ
పాల్వంచ పట్టణం పరిధిలోని ఎర్రగుంటలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి 30 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. మొక్కజొన్న పంటని ప్రకృతి విపత్తుగా గుర్తించి ఎకరానికి రూ.60000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రగుంటలో దగ్ధమైన మొక్కజొన్న పంటను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధం కావటం రైతు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని దీనిని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహార అంచనాలను తయారుచేసి నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నుండి దీనికి అయ్యే నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ప్రభుత్వం రికవరీ చేసి రైతులకు ఇచ్చే ఆదుకోవాలని వారు కోరారు. వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ, రెవిన్యూ శాఖ సమన్వయంతో నష్టపో యిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించకపోతే పోరాట కార్యక్రమాన్ని రూపొందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దొడ్డ రవికుమార్, రైతు సంఘం నాయకులు కొండబోయిన వెంకటేశ్వర్లు, బుడుగుల శ్రీకాంత్, నిరంజన్, రహీం, భాస్కర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.