Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన చట్టాలు, జీవోల అమలుకు ఐక్య ఉద్యమాలు
- ఏఎస్పీ జిల్లా కార్యదర్శి పాండ్రు హేమసుందర్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఏజన్సీ ప్రాంతంలో నివశిస్తున్న ఆదివాసీల అభివృద్ధి రాజకీయ పార్టీలకు పట్టడం లేదని ఏఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పాండ్రు హేమసుందర్ ఆరోపించారు. సోమవారం ములకపాడు గ్రామంలో ఏఎస్పీ డివిజన్ అధ్యక్షులు సోంది మల్లూరు అధ్యక్షతన ఏఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా హేమసుందర్తో పాటు సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం నర్సింహారావు మాట్లాడుతూ భద్రాచలం నియోజవర్గంలో పోడు భూమి సమస్యను భూచిగా చూపెడుతూ గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించిన సమయంలో పోడు భూముల సమస్యను మాత్రమే ముందుకు తీసుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. గిరిజన హక్కులు, చట్టాలు వాటి అమలు రాజకీయ పార్టీలు ఎందుకు ప్రభుత్వాలను ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని దీని పై అధికారులు ఎందుకు ఎల్టిఆర్ కేసులు నమోదు చేయడం లేదని అన్నారు. దీని పై తాము ప్రశ్నిస్తే డబ్బుల కోసం ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయన్నారు. మనల్ని పావుల్లా వాడుకుంటున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఎజన్సీ ప్రాంత వనరులు ఖనిజ సంపద, ఆదివాసీ చట్టాలను హక్కులను కాపాడే దిశగా ముందడుగు వేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శి నూపసీతయ్య, మండల అద్యక్షులు కుర్సం రవి, నాయకులు వాసం రమేష్, రేసు రాంబాబు, కొమరం వినయ్ బాబు, రామ్మూర్తి, వెంకన్న, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.