Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-పినపాక
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహా సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. సోమవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ టీఏజీఎస్ మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మే 5, 6వ తేదీలలో భద్రాచలంలో జరిగే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ గ్రామాల్లో ఆదివాసి హక్కులు చట్టాలు అమలుపరచాలని, అటవీ హక్కుల పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి హక్కులు అమలు చేయాలని జల్ జంగిల్ జమీన్ హమారా నినాదంతో పోరాడిన ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీమ్, బిర్సా ముండా, సమ్మక్క సారలమ్మ, అల్లూరి సీతారామరాజు, సోయం గంగులు, కుంజ బుజ్జి, సున్నం రాజయ్య స్ఫూర్తితో నిత్యం ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలన్నారు. విద్య, వైద్యం, భూ సమస్యల వంటి అనేక సమస్యలపై, చట్టాలు రక్షణకై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాటి అమలుకై ఉద్యమించాలన్నారు. అయిదవ షెడ్యూలు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం అటవీ సంపాదన కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని అటవీ సంరక్షణ నియమాలను వెనక్కి తీసుకోవాలని, భద్రాచలం మూడు గ్రామ పంచాయతీలుగా కాకుండా ఒకే గ్రామపంచాయతీ కొనసాగించి గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఆదివాసీ గ్రామాల్లో వేసవిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మతచిచ్చులు రేపి గిరిజనులను విభజిస్తుందని మండిపడ్డారు. ఆదివాసీలను అడవి నుండి షెడ్యూలు ప్రాంతాల నుండి గెంటివేస్తూ, సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు. ఈ స్థితిలో గిరిజన తెగను సంఘటితం చేసి వారి భాష సంస్కృతిని పరిరక్షించేందుకు గిరిజన గిరిజన తెగలను ఐక్యం చేసేందుకు మహాసభలు ఏర్పాటు చేస్తున్నామని ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న, మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, నట్టి శంకరయ్య, కల్తి వెంకటేశ్వర్లు, పాండురంగాపురం సర్పంచ్ ఈసం భవతి, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
దమ్మపేట : మే 5న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, వాటిని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. సోమవారం మండలంలో పార్టీ జనరల్ బాడీ సమావేశం పార్టీ కార్యలయం సుందరయ్య భవనంలో సీనియర్ నాయకులు యండ్రాతి అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన పులయ్య మాట్లాడారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఆ సభలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు మిడియం బాబూరావు, తదితర నాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదొర్కంటున్న అన్ని రకాల సమస్యలు పరిష్కారం కోసం ఈ సభలో చర్చించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు అందరికీ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్రమోడీ పరిపాలన ప్రజా వ్యతిరేక పాలనచేస్తుందన్నారు. సమ్మె చేస్తున్న గ్రామ దీపికల డిమాండ్ల రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస్ రావు, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డాలక్ష్మినరాయణ, పిల్లి నాయుడు, మోరంపూడికేశవరావు, కొప్పుల శ్రీనివాస్ రావు, బోగ్యం నరసింహరావు, కొలిక్కి పోగుశ్రీనివాసరావు, పెనుబల్లినానారావు, రావులశోభన్ బాబు, మోరంపూడి సూర్యనారాయణ, పి.కాంతారావు, కే.వెంకటేశ్వర రావు, సూర్యానారాయణ. తదితరులు పాల్గొన్నారు.