Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని బండారుగూడెం ప్రాదమికోన్నత పాఠశాలకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే మరుగుదొడ్డి నిర్మాణ పనులను ప్రధానోపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు, పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా రూ.2.50 లక్షల రూపాయలతో మరుగుదొడ్డి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వెష్ట్రన్ బేషన్తో పాటు మోడల్‌గా మరుదొడ్డి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా విద్యా సంవత్సరం చివరి రోజు కావడంతో విద్యార్దుల తల్లి దండ్రులతో సమావేశం నిర్వహించి ఏడవ తరగతి విద్యార్దులకు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ కుంజా నాగేశ్వరరావు, ఉపాద్యాయులు సీతారం, వంశీమోహన్, రవి, సరోజిని తదితరులు పాల్గొన్నారు.