Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీజీకేఎస్ ఉపాధ్యక్షలు ఎండి.రజాక్
నవతెలంగాణ-కొత్తగూడెం
వేసవి తీవ్రత దృష్ట్యా కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షలు ఎండి.రజాక్ సింగరేణి అధికారులను కోరారు. సోమావారం సత్తుపల్లి జేవిఆర్ ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్.వెంకటాచారిని కలిసి కార్మిక సమస్యల పై చర్చించారు. వేసవిచలువ పందిరిళ్ళు, మంచి నీళ్ళ కుండలు, ఇపీ, సిహెచ్పిలో రెస్ట్ హాల్, వాటర్ కూలర్, బస్సు షెల్టర్ ఏర్పాటు గురించి చర్చించారు. సానుకూలంగా స్పందించిన పీఓ కార్మికుల అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ కూసన వీరభద్రం,సెంట్రల్ కౌన్సిల్ మెంబెర్ రమేష్ బాబు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మాధవరెడ్డి, పిట్ సెక్రటరీలు జేఎస్ఆర్.మూర్తి, మురళి కృష్ణ, స్ట్రక్చర్ నెంబర్ చెన్నకేశవరావు, ఎస్డి.గౌస్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు కోనం వెంకటేశ్వర్లు, ఉపేంద్రచారీ, కంచె శ్రీను, సీఇఆర్ క్లబ్ జాయింట్ సెక్రటరీ గణపనేని శ్రీనివాసరావు, పాల్గొన్నారు.