Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావాణిని కలెక్టర్
- ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల స్వీకరణ
- పరిష్కారానికి కలెక్టర్ అధికారులకు ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను జాప్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాల్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు దరఖాస్తుల స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల్లో ములకలపల్లి మండలం భగత్ సింగ్ నగర్ గ్రామానికి చెందిన తాళ్ల వీరయ్య తన కూతురు పెళ్లి ఖర్చులకు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దారా కిట్టయ్య వద్ద రూ.లక్ష అప్పు తీసుకుని దఫాలుగా మొత్తం చెల్లించానని అయినప్పటికీ కిట్టయ్య 100కు రూ.5 వడ్డీ చొప్పున చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాడని వడ్డీ తగ్గించి దఫాలుగా చెల్లించి విధంగా విసురుబాటు కల్పించాలని చేసిన దరఖాస్తు కలెక్టర్ పోలీస్ శాఖకు సిఫార్సు చేశారు. అలాగే అశ్వరావుపేట మండలం మొద్దుల పంచాయతీకి చెందిన కట్ట భీమయ్య మరికొందరు గిరిజనులు పంచాయతీ పరిధిలోని ఉడుముల బండ రాళ్లవాగు మధ్య గుంపు పెద్ద మిద్ది గ్రామాల ప్రజల తాగునీటి లేక వాగులలో చదువులు నీరు తాగుతున్నామని వేసవిలో వాగులు ఎండిపోతున్నడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని బోర్లు వేసి చేతిపండు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. తక్షణమే తహసిల్దార్‌కు ఎండర్స్ చేసి పరిష్కరించాలని కోరారు. తదితర మండలాల నుంచి ధరఖాస్తులను పరిశీలించి, సంబందిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణిలో అదనప కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.