Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ భద్రాచలం రూరల్
ఎనిమిదవ రోజు వీఓఏలు మండుటెండలో ఒంటి కాలుపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెను లైన్స్ క్లబ్ కార్యదర్శి దాట్ల శ్రీనివాస్ రాజు ప్రారంభించి మాట్లా డారు. మహిళలు ఇంటి పనితో పాటు బయటికి వచ్చి డోక్రా మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తీరు అభినందనీ యమన్నారు. ఇటువంటి నిరంతర శ్రమ చేస్తున్న మహిళా కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుక ోవాలని, కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి నరసింహచారి, మాజీ కార్యదర్శి రామలింగేశ్వర రావు హాజరై మాట్లాడారు. అదేవిదంగా భద్రాద్రి ప్రజా సేవకులు అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండే గాదె మాధవ రెడ్డి మాట్లాడుతూ మండుటెండలో మహిళలు చేస్తున్న ఈ పోరాటాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వీరి సమస్యలు పరిష్కరించాలన్నారు. శిబిరానికి భద్రాద్రి కార్ స్టాండ్ అధ్యక్షులు రమణ, ఖలీల్ రాము సంఘీభావం తెలిపారు. మరియు భద్రాద్రి పండ్ల వర్తక సంఘం నాయకులు వేల్పూరి రాము బాలాజీ సంఘీభావం తెలిపి వీవోఏలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. దీక్షల ముగింపుకు భద్రాద్రి కాపు యువసేన నాయకులు బండారు శ్రీకాంత్, తన్నీరు సాయి, దినేష్, బూర్గంపాడు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వారాల వేణు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబీ నర్సారెడ్డి, శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక, సీఐటీయూ పట్టణ నాయకులు, నాగరాజు జి.లక్ష్మణ్, పి.సంతోష్, డీవైఎఫ్ఐ నాయకులు సతీష్, వీవోఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్రలీల, కోశాధికారి సీతారత్నం, సహాయ కార్యదర్శి జానకి తదితరులు పాల్గొన్నారు.
గ్రామదీపికలకు చిన్నారి చిరు సాయం
సమ్మె చేస్తున్న గ్రామదీపికల సంఘానికి భద్రా చలం పట్టణానికి చెందిన నవీన్ నికిత దంపతులకు చెందిన సిద్ధి అద్విత చిన్నారి తన కిడ్డి బ్యాంకులో దాచుకున్న నగదును మొత్తంతో తిను బండారాలు విక్రయించి, గ్రామ దీపికల సమ్మె శిబిరానికి స్వయంగా తీసుకొచ్చి గ్రామ దీపికలకు అందించింది. అతి చిన్న వయసులోనే ఉన్నతంగా ఆలోచించినా కచ్చితంగా అద్వితను గ్రామ దీపికలతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు అభినందించారు.
కొత్తగూడెం టౌన్ : వీవోఏల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న ఆరోపించారు. సోమవారం వీఓఏల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరం సందర్శించిన ఆయన మాట్లాడారు. గత 8 వ రోజుగా వీఓఏలు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమ్మె శిబిరంలో విఓఏల సంఘం నాయకులు రేష్మ, మాధవి, స్వరూప, అరుణ, రాజమణి, సత్యవతి, పద్మ, రజిత, జహేద, సఫియా, రమణ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : వీవోఏల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు వెంకటాచారి వీవోఏలు చేపట్టిన వంటి కాలిపై నిరసనకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వీవోఏలు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : వీఓఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం చాలా విచారకరమని సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ అన్నారు. గత 7 రోజులుగా వీఓఏలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రానికి వచ్చి వారి సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, వీఓఏ మండల అధ్యక్షురాలు కమలకుమారి ఉపాధ్యక్షులు నాగేశ్వరావు, సత్యనారాయణ, వెంకటేశ్వరావు, అలింభీ, బ్రహ్మం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : సమాజంలో ఏ రంగంలో అయినా అసంఘటిత ఉద్యోగులు, కార్మికులు మేలు కోరుతూ వారి పక్షాన నికార్షుగా పోరాటం చేసేది సీపీఐ(ఎం) మాత్రమే అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.పుల్లయ్య అన్నారు. వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెకు పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తూ వారికి సంఘీ భావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, చిరంజీవి,స ోషల్ మీడియా బాధ్యులు రమేష్, మడిపల్లి వెంకటేశ్వర రావు, మురళి, వీఓఏల బాధ్యులు పాల్గొన్నారు.
వీఓఏల పోరాటం ఉధృతం చేయాలి : రమేష్
సోషల్ మీడియా ద్వారా వీవోఏల పోరాటాన్ని ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు చేరేలా, పాలక వర్గాలకు కనువిప్పు కలిగేలా ఐకేపీ, వీఓఏ పోరాటాలను కొనసాగించాలని సీఐటీయూ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ భూక్యా రమేష్ అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట కేంద్రాల్లో సమ్మె శిబిరం వద్ద ఆయన మాట్లాడారు.
దుమ్ముగూడెం వీవోఏలు ఒంటి కాలు పై నిల్చొని వినూత రీతిలో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సిఐటియు మండల కన్వీనర్ కే.చిలకమ్మ మాట్లాడుతూ వీవోఏల న్యాయమైన కోర్కెలు తీర్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని అన్నారు. జిల్లా ఉపాధ్యకులు గద్దల వెంకటేశ్వర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.