Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఇటీవల గాలి దుమారంతో వచ్చిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి చేలను ఆయన పరీశీలించి, మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చే సమయంలో విపత్తుల రూపంలో వస్తున్న వడగండ్ల వానలకు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల సహాయం కింద నిధులు విడుదల చేయాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్, యాసంగి సాగు చేసిన రైతులకు రూ.6 వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం నష్ట పోయిన పంటలను సర్వే చేసి ఆహార ధాన్యాల పంటలకు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు రూ.40 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి వారిని అన్ని విదాలా ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన మొక్క జొన్నలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. పంటలను పరీశీలించిన వారిలో వ్యవశాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అద్యక్షులు యలమంచి వంశీకృష్ణ, గిరిజన రాష్ట్ర నాయకులు కారం పుల్లయ్య, రైతు సంఘం సీనియర్ నాయకులు యలమంచి శ్రీనుబాబు, రైతు సంఘం మండల అద్యక్షులు బొల్లి సత్యనారాయణ, దుమ్ముగూడెం జిపి ఉపసర్పంచ్ తాటిపూడి రామస్వామి రైతులు పాల్గొన్నారు.