Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు అన్ని కులాల మతాలకతీతంగా జరుపుకునే మే డేని యావత్ కార్మికు లోకం జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ పిలుపు నిచ్చారు. గురువారం స్థానిక సిఐటియూ కార్యాయలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ 44 కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి స్వాతంత్రం కంటే పూర్వమే కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కుల్ని కాల రాస్తుందని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో మేడే పోరాటానికి కార్మికులంతా సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి డి.వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.