Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఓటు జీఎం డి.లలిత్ కుమార్‌కు వినతి
నవతెలంగాణ-మణుగూరు
పీకే ఓసీలో ఇటీవల సింగరేణి యాజమాన్యం ప్రవేశపెట్టిన ప్రయివేటు యంత్రాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఐఎఫ్టీయూసీల ఆధ్వర్యంలో ఏరియా ఎస్ఓటు జీఎం డి.లలిత్ కుమార్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరునామా పై అందజేసిన ఈ వినతిపత్రాన్ని హైదరాబాద్ సింగరేణి భవన్‌కు పంపించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓసి-4లో గత కొంత కాలం క్రితం ప్రయివేటు సర్ఫేస్ మైనర్‌ను, ఓసి-2లో ఇటీవల రెండు ట్రాక్ మౌంటెడ్ మల్టిబుల్ ప్రయివేట్ డ్రిల్స్ ఏరియా కార్మిక సంఘాలుగా దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కొత్త గనులు కేటాయింపు జరగని నేపథ్యంలో సింగరేణి భవిష్యత్తుపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని ఖండిస్తూ 2500 కోట్ల వార్షిక నికర లాభాలనర్జీస్తోందని అవసరమైతే విశాఖ ఉక్కును కూడా సింగరేణి ద్వారా కొనుగోలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తూనే రెండోవైపు చాప కింద నీరులా అంతర్గతంగా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీ కరణ చేసుకుంటూ పోతే సింగరేణి భవిష్యత్ పీకే ఓసి పరిస్థితి ఏమిటని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వల్లూరి వెంకటరత్నం, వై.రామ్మూర్తి, ఐఎఫ్టియు నాయకులు సయ్యద్ నాసర్ పాషా, అంగోత్ మంగీ లాల్ తదితరులు పాల్గొన్నారు.