Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌కి సంబంధించిన అండర్ గ్రౌండ్ వాటర్ టన్నెల్స్‌ను గుంపెన గ్రామంలోని ఓపెన్ యార్డ్‌లో 9 ఐరన్ పైప్‌లు ఉంచగా గుర్తు తెలియని దొంగలు అందులో 4 పైపులను, పూర్తిగా ఒక పైపులోని సగ భాగంను కత్తిరించుకుని దొంగిలించారు. ఇరిగేషన్ ఏఈ మీనా ఫిర్యాదు మేరకు ఎస్సై యస్.డి షాహీన కేసు నమోదు చేసి, చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గురువారం ఉదయం పోలీసు డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులు చూసి అశోక్ లైలాండ్ వాహనంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోని తీసుకున్నామన్నారు. విచారించగా బానోత్ బాబురావు (37) కేటిపియస్ కాజువల్ లేబర్, అజ్మిరా రవి (37) వెల్డర్, సడియం మనోజ్ కుమార్ (28) తాపీ మేస్త్రి, కొక్కు కోటేశ్వర రావు (38) వృత్తి తాపీ మేస్త్రి, బానోత్ నవీన్ (28) తాపీమేస్త్రి, గుగులోతు బుజ్జి (50) వీళ్ళందరూ కరకవాగు పాల్వంచ మండలం కొత్తగూడెం జిల్లా చెందిన వారు అని వీళ్ళు అందరు పైపులను గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ ఉపయోగించి ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క భాగాన్ని చిన్నచిన్న ఇనుప ప్లేట్లు చేసి పాల్వంచ పట్టణం దమ్మపేట సెంటర్లో గల పాత ఇనుప కొట్టు యజమాని వంచ్చడా సత్యంకి అమ్ముతువుంటారని విచారణలో తేలిందన్నారు. దొంగతనం చేసిన పైపుల విలువ రూ.8,61,642 ఉంటాయని వంచ్చడా సత్యం దగ్గర నుండి రూ.6 లక్షలను రికవరీ చేశామని, అదేవిధంగా వీరివద్ద నుండి టీఎస్ 04 యూబీ 6413 నెంబర్ గల అశోక్ లైలెండ్ వాహనం, పైపులను కట్ చెయ్యటనికి ఉపయెగించే ఒక గ్యాస్ సిలిండర్, రెండు ఆక్సిజన్ సిలిండర్లు, గడ్డ పలుగు, గొడ్డలి, ఒక బ్యాగ్, గ్యాస్ కట్టర్, గ్యాస్ లైటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరి పై కేసు నమోదు చేసినామని, పైపులు దొంగిలించిన మరుసటి రోజే కేసును త్వరగా చేదించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత కుమార్, అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్సపెక్టర్ యస్.డి షాహిన, ఏఎస్ఐ పుల్లారావు, క్రైమ్ సిబ్బంది కానిస్టేబుల్, ఆంగోతు రామారావు, లకావత్తు సర్వేశ్వరరావు, హౌంగార్డు బాలాజీని, డ్రైవర్ కృష్ణని, కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్ అభినందించారు.