Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.వీరన్న డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా వీఓఏలు వారి సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మెలను ప్రభుత్వం పట్టించుకోక పోతే సమ్మె ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.వీరన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీఓఏలు చేస్తున్న దీక్షలు గురువారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విఓఏలు మోకాళ్ల మీద నిలబడి నిసన తెలిపారు. ఈ సంర్భంగా వీరన్న మాట్లాడారు. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి వారికి గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్పృహ కోల్పోయిన వీఓఏ
కొత్తగూడెంలో పెరుగుతున్న వేసవి తీవ్రత, ఎండవేడిమి దృష్ట్యా, సమ్మె దృష్ట్యా సమయానికి ఆహారం లేక పోవడంతో వీఓఏలు ఆనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో సమ్మె దీక్షలో ఉన్న వీఓఏ అస్వస్థతకు గురయ్యారు. స్పృహకోయిన వెంటనే తోటి వీఓలు సపరిచర్యలు చేశారు. కొద్ది సేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రేష్మ, మాధవి, స్వరూప, మైమున్సిసా, అరుణ, సత్యవతి, జహిదా, సఫియా, పద్మ, పద్మావతి, రమణ, తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని 11 రోజులుగా నిర్వహిస్తున్న వీవోఏల సమ్మెకు మద్దతు సంఘీభావం తెలియజేశారు. అయన మాట్లాడుతూ వీవోఏలతో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పనులు వారికి అప్పజెప్తూ వారితో వెట్టి చాకిరి చేపించుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి వీవోఏలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు, వీఓఏల మండల అధ్యక్షురాలు కనకమాలక్ష్మి, తానం నరసింహారావు, ఇసంపల్లి విజయబాబు, రమణ, ముదిగొండ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
వివోఏలను వెట్టిచాకిరి చేస్తున్న ప్రభుత్వం : తాటి
రాష్ట్రంలో కష్టపడుతున్న కార్మికులు, కర్షకులు పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ములకలపల్లి మండల కేంద్రంలో సమ్మె చేపట్టిన వీఓఏలకు తాటి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు వీఓఏలు కృషి చేస్తున్నారని, వారిని తెలంగాణ ప్రభుత్వం వెట్టిచాకిరి చేస్తుందని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో చిన్నారి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జహీర్, కోండ్రు భాస్కర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పాలకుర్తి రవి, సీపీఐ(ఎం) నాయకులు నిమ్మల మధు, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : సమస్యలు పరిష్కరించాలని వీఓఏల చేస్తున్న సమ్మె గురువారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా కూర్చుని సమ్మె చేస్తున్నా ఐకేపి వీవోఏలకు మద్దతు తెలపడానికి సీఐటీయూ మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ సందర్శించారు. సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఓఏల ఇల్లందు అధ్యక్షురాలు నవ్య, ప్రమీల, పాపారావు, వసంతరావు, సుల్తాన, పృధ్వీ, సుమతి, నాగలక్ష్మి, సుజాత, వసంత తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : వీవోఏల కోరికలు న్యాయమైనవని సీఐటీయూ జిల్లా కోశాధికారి జిలకర పద్మ, జిల్లా నేత అబ్దుల్ నబి, మండల నాయకులు కొండపల్లి శకుంతల, పీ.రాజేశ్వరి అన్నారు. గురువారం సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. మాట్లాడారు. ఈ సమావేశంలో వీఓఏ టేకులపల్లి అధ్యక్షురాలు డి.చంద్రకళ, గౌసియా, శిరోమణి, జయ, రాజు, మంగిలాల్, నాగమణి, ప్రమీల, పావని తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : వీవోఏలకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్వోగ భద్రత కల్పించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మోకాలు పై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్, వీవోఏలు షహీన, భాగ్య లత, శివ కుమారి, బుజ్జి, జయలక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పినపాక : వీఓఏలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, వారి సమ్మెకు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. అనంతరం పాయం మాట్లాడారు. మద్దతు తెలిపిన వారిలో పాయం అభిమానులు పేరం వెంకటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, గుట్టయ్య, శ్రీను, వార శంకర్, సమ్మయ్య, అర్జున్, రవి, శ్రీను, తదితరులు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు.