Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంస్కృతి అద్దం పట్టేలా టీఏజీఎస్ రాష్ట్ర 3వ మహాసభలు
- బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా భద్రాచలం నుండి పోటీ
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వచ్చే నెల 3,4,5,6 తేదీలలో భద్రాచలంలో జరిగే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభల సందర్బంగా 5వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి ఎన్నికల జయభేరీ మోగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. గురువారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్లో జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన మండల పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మే నెలలో భద్రాచలం పట్టణంలో జరిగే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల సందర్బంగా 3,4 తేదీలలో రేలా పండుం పేరిట ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 5న భద్రాచలం పట్టణంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వేలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభకు మాజీ ఎంపీ ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి తోడసం భీమ్‌రావులు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో మతోన్మాద మహంకారి బీజేపీ పార్టీ మనుధర్మం శాస్త్రం పేరిట రాజ్యాంగ విలువలను మంటగలుపుతోందని అన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ తరహా పాలనను అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ది గెలుపుకు కృషి చేసిన కమ్యూనిస్టుల ఆవశ్యకతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలతో కలసి పోటీ చేసేందుకు ఒక అవగాహనకు వచ్చారన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తుందని ఆత్మీయ సమావేశాల్లో మాట్లాడడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుందని ఒక వేళ పొత్తు ఉన్నా లేకున్నా సీపీఐతో రాష్ట్ర వ్యాప్తంగా కుదిరిన ఒప్పందంలో భాగంగా పార్టీ వారస త్వంగా భద్రాచలం అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ(ఎం) పోటీ చేస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, మర్మం సమ్మక్క, సోషల్ మీడియా రాష్ట్ర భాద్యులు పిట్టల రవి, జిల్లా భాద్యులు భూక్యా రమేష్, మండల భాద్యులు కుమ్మరికుంట్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
టీఏజీఎస్ భారీ బహిరంగ సభకు మన సత్తా చాటాలి : మచ్చా
మే 4, 5వ తేదీలలో జరిగే టీఏజీఎస్ రాష్ట్ర మహాసభల సందర్బంగా 5వ తేదీన జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మన సత్తా చాటాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం యలమంచి సీతారామయ్య భవన్లో జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన పార్టీ మండల స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం గడ్డ సీపీఐ(ఎం) పార్టీకి అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీపీఐ(ఎం) జెండా ఎగరడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.
ఆనాటి ముర్ల ఎర్రయ్య రెడ్డి మొదలుకొని కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు ఎనిమిది సార్లు భద్రాచలం శాసన సభ్యు లుగా గెలుపొందిన చరిత్ర సీపీఐ(ఎం) పార్టీకి ఉందన్నారు. భద్రాచలం డివిజన్‌కు గుండెకాయ లాంటి దుమ్ముగూడెం మండలం నుండి 8 వేల మంది జనసమీకరణ జరగాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.