Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-బూర్గంపాడు
వీవోఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గురువారం మండల కేంద్రమైన బూర్గంపాడులో వీవోఏలు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి ఆయన మద్దతు ప్రకటించారు. అలాగే సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామదీపికలకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన అన్నారు. ఈ సమ్మె చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ఎర్రటి ఎండల్లో సమ్మెలో కూర్చున్న వీవోఏలకు వడ దెబ్బ తగిలి ఎవరైనా దేనికైనా గురైతే బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బూర్గంపాడులో ఇప్పటికే 11 రోజుల నుండి సమ్మెలో పాల్గొంటున్నారని, స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన అన్నారు. వీఓఏలను ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని ఆయన అన్నారు. కనీసం రూ.26,000 ఇవ్వాలన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు భారీ ఎత్తున రేట్లు పెంచి వంటగ్యాసు రూ.1200కి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతూ సామాన్య ప్రజలు నడ్డి విర్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, పాపినేని సరోజన, రాము, రాయల వెంకటేశ్వర్లు, సీఐటీయూ కన్వీనర్ బర్ల తిరపతయ్య, కనకం వెంకటేశ్వర్లు, నిమ్మల అప్పారావు, కొమ ర్రాజు సత్యనారాయణ, నాగమణి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.