Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
సీపీఐ ప్రజాపోరు యాత్రను విజయవంతం చేసినందుకు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కర్ రావు ధన్యవాదాలు తెలిపారు. గురువారం మండల కౌన్సిల్ సమావేశం తంగేళ్ల ముడి శివకృష్ణ అధ్యక్షన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా మండల ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. నేటి పరిస్థితిని బట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని, కార్మికులు, కర్షకులు బతికే ప్రసక్తి లేదన్నారు. గిరిజన బందు, కూలి బందు అమలు చేయాలని, ఇండ్ల స్థలం లేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ మొదటి వారంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కూకలకుంట సత్యనారాయణ, సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, రాపోలు శివన్నారాయణ, తుపాకుల శాంతి కుమారి, కృష్ణవేణి, వెంకటేష్, జాన్ బి, నాగమణి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.