Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపాలెం
అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి పేదలకు ఇళ్ల స్థలాలు చూపిస్తామని పార్టీ మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో ఎస్.నవీన్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు అనేకమంది ఇంటి స్థలాలు, ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ అధికారులు రఘునాథపాలెం మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను రక్షించాలని, మండలంలో ఉన్న అర్హులైన పేదలను గుర్తించి ఇంటిస్థలాలు ఇవ్వాలని లేకపోతే సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వల్లూరి శ్రీనివాస్, కన్నెగంటి తిరపయ్య, రహీంఖాన్, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కూచిపూడి నరేష్, గుగులోతు కుమార్, మంగ, సక్కుబాయి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్.ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.