Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నల్లమల
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి, మరింత అభివృద్ధికి చేయూతనివ్వాలని రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు చెందిన 60 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.23,06,000 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలసి లబ్ధిదారులకు అందజేశారు. జిల్లా టెలికం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, పార్టీ మధిర,వైరా నియోజకవర్గాల సోషల్ మీడియా ఇంచార్జ్లు తాళ్ళూరి హరీష్, నరేష్, నామ సేవా సమితి నాయకులు కృష్ణప్రసాద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.