Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 7న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా డే
- సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గార్గే
నవతెలంగాణ- ఖమ్మం
తలసేమియా చిన్నారులు రక్తం ఎక్కించుకోవడంతో పాటు వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా మందులను వేసుకోవాలని సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గార్గే సూచించారు. శుక్రవారం ఖమ్మంలోని రితన్య ఆసుపత్రిలో తలసేమియా డేకేర్ సెంటర్లో సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ గార్గే మాట్లాడుతూ 14 ఏళ్లుగా తలసేమియా చిన్నారులకు తమ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఉచిత రక్తం, మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో హెచ్ఎల్ఏ 10 బై10 మ్యాచ్ అయిన చిన్నారులకు బోన్‌మ్యారో ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు. చిన్నారులకు మెరుగైన సేవ లందించేందుకు సంస్థ ప్రతి ఏటా కొత్త కార్యక్రమాలు తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది మే 7న సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా డే నిర్వహిస్తున్నామన్నారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేలా ప్రపంచ తలసేమియా డే నిర్వహించాలని, తమ సంస్థ నిర్ణయించినట్లు తెలిపారు. మే 7న చిన్నారులకు సాంస్కృతి కార్యక్రమాలతో పాటు హెచ్ఎల్ఏ పరీక్షలు, బోన్ మ్యారో వైద్యంపై అవగాహన కార్యక్రమం, వైద్యులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ తలసేమియా దినోత్సవం ముఖ్య ఉద్దేశం వ్యాధిపై అవగాహన కల్పించడమని, దానిలో భాగంగా ఈ ఏడాది మే 7 నుండి 2024 మే 1వ తేదీ వరకు సంస్థ ఆధ్వర్యంలో తలసేమియాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు డి.నారాయణమూర్తి, సంస్థ ఉపాధ్యక్షురాలు పి.పావని, కోశాధికారి పి.రవిచందర్, సభ్యులు పి.ఉదరుభాస్కర్, ఎన్.ఉపేందర్, ప్రసాద్, డి.రాములు, కృష్ణ, సైదులు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.