Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు నుండి భద్రాచలాన్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-భద్రాచలం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపు ప్రమాదం పొంచి ఉన్న భద్రాచలం పట్టణాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం శుక్రవారం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర జల సంఘం సమావేశంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలం ముంపుకు గురవుతుందని పేర్కొనడం జరిగిందని ఈ నేపథ్యంలో ముంపునుండి భద్రాచలం రక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. భద్రాచలం పట్టణాన్ని పోలవరం ముంపు బారిన పడేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కరకట్టను పటిష్టపరిచి, ఎత్తు పెంచి, పొడిగించే దానికి కావలసిన నిధులను కేంద్రం నుండి రాబట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి గోదావరి ఇరువైపులా కరకట్టలు నిర్మించే దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని, ముంపుకు గురయ్యే ప్రాంతంలో నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింపజేసి నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివాసి బహిరంగ సభ, సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయండి
సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్ మచ్చా
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా మే 5వ తేదీన భద్రాచలంలో జరిగే గిరిజన బహిరంగ సభను జయప్రదం చేయాలని, మే 3, 4 తేదీలలో భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే ఆదివాసి సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ మహాసభల సందర్భంగా పట్టణంలోని అన్ని కాలనీలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక సున్నం, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, బి.వెంకటరెడ్డి, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, ఎన్ లీలావతి తదితరులు పాల్గొన్నారు.