Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ భద్రత కల్పించాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వ పథకాలని ప్రతి ఇంటికి చేరవేసే పాత్ర వీవోఏలదేనని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని వీవోఎలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారానికి 12వ రోజుకు చేరింది. ఈసందర్భంగా రమేష్ సంఘీభావం తెలిపారు. కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్యకర్తలు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, సుల్తానా, కే.మరియ, వ్యకాస నేత ఆలేటి కిరణ్ కుమార్, మన్యం మోహన్ రావులు మాట్లాడారు. వివిధ వీవోల ఓబి సభ్యులు పాల్గొని పూర్తి సంఘీభావం తెలియజేశారు. నవ్య, ప్రమీల పాపా రావు, మోతిలాల్, వసంతరావు, నీలా బాయి, సురేష్, వసంత, తదితరులు పాల్గొన్నారు.