Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని
నవతెలంగాణ-అశ్వారావుపేట
గ్రామస్థాయిలో పథకాలను ఫలవంతం చేయడంలో వీఓఏల పాత్ర కీలకమని, వీవోఏ చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, వారి డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ప్రకటించారు. శుక్రవారం పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షణ నిమిత్తం అశ్వారావుపేట వచ్చిన ఆయన గత 12 రోజులుగా వీవోఏలు చేపట్టిన సమ్మె శిభిరం వద్దకు వచ్చి వారికి మద్దతుగా కూర్చున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో గ్రామ స్థాయిలో పనిచేసే వీవోఏ లే పేదలుగా ఉండటం, వారితో ఆ సంస్థ వెట్టి చాకిరీ చేయించుకోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పార్టీ పరంగా కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్, మండల కార్యదర్శి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.