Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 37 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ పోరాటాలు
- నామా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-మణుగూరు
నిజాయితీ, నిరాడంబరత, క్రమశిక్షణతో కూడిన జీవితం సాగిస్తూనే 40 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద పరిశ్రమ అయినా సింగరేణిలో 40 సంవత్సరాలు సీనియర్ మెకానిక్‌గా ఫోర్ మెన్‌గా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూనే 37 సంవత్సరాలు కార్మిక ఉద్యమాలు నిర్వహించారు. అనేక పోరాటాలు నిర్వహించిన కార్మిక నేతగా తనదైన ముద్ర వేసుకున్న నామా వెంకటేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం. నామా వెంకటేశ్వరరావు స్వగ్రామం పినపాక మండలం జానంపేట రైతు కుటుంబం, తన కుటుంబంలో ఐదుగురు అన్నలు, నలుగురు అక్కలుతో ఉమ్మడి కుటుంబంగా ఉండేది. చిన్నతనంలో నాన్న పశువుల కాపరి పంపగా పసిప్రాయాల్లోనే చదువుకోవాలని ఆలోచనతో జానంపేట ఏడుల్ల బయ్యారంలో విద్యాభ్యాసం కొనసాగించారు. బూర్గంపాడులో ఇంటర్ మొదటి సంవత్సరం అనంతరం ఐటీఐ విద్యను పూర్తి చేశాడు. బీపీఎల్‌లో సూపర్వైజర్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 1981 సంవత్సరంలో సింగరేణిలో అప్రెంటిస్ కోసం ప్రవేశించాడు. 1983 నుండి మెకానిక్‌గా 40 సంవత్సరాలు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు. 1983 మేలో కమ్యూనిస్టు అగ్ర నాయకులు మంచి కంటి కిషన్ రావు రజబలి సమక్షంలో హైమావతిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. కుటుంబ నేపథ్యం కమ్యూనిస్టులు కావడంతో విద్యార్థి ఉద్యమం నుండి వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకొని అనేక ఉద్యమాలు నిర్వహించారు. 2001లో 660, 2007లో 950 ఓట్లతో రెండు సార్లు సింగరేణి ఎన్నికల్లో ఏఐటీ యూసీని గుర్తింపు సంఘంగా నామా వెంకటేశ్వరరావు గెలి పించారు. 1987 సంవ త్సరంలో సింగరేణిలో విద్యుత్తు స్టార్టర్ పోయిందన్న నెపంతో సింగరేణి యాజమాన్యం కేసులు బనాయించింది. ఒక కార్మికుని తీసుకెళ్లి పోలీసులు విపరీతంగా కొట్టారు. నిరసనగా మూడు రోజులు కార్మికులు నామ నాయకత్వంలో సమ్మె చేశారు. యాజమాన్యం పరిష్కారం చేయలేని పరిస్థితిలో మంచి కంటి రామ్ కిషన్ చొరవతో ఎస్పీ దగ్గరికి వెళ్లి పోలీసుల సమస్యను నామా వెంకటేశ్వరరావు పరిష్కారం చేయించారు. దీనికి యాజమాన్యం ఆగ్రహించి నాస్మా, ఎస్మా చట్టాలను ప్రయోగించింది. నామా వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని చార్జ్ షీట్ యాజమాన్యం ఇచ్చింది. దానికి 18 సార్లు ఎంక్వయిరీ చేసి నిరూపించలేకపోయారు. ఓసీల ఏర్పాటులో పబ్లిక్ హియరింగ్ సమావేశంలో ప్రజలకు, సింగరేణి కంపెనీకి అనుసంధానంగా ఉంటూ ఓపెన్ కాస్ట్‌లు ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించారు. జీఎం వాసుదేవరావు డైరెక్టర్‌గా బదిలీపై వెళుతుండగా నూతన జనరల్ మేనేజర్ దత్తాత్రేయులు వచ్చే సమయంలో అధికారులకు కార్పెట్ పరిచానని అనేక విమర్శలు ఎదురైనాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో నామాకు మాట్లాడే అవకాశం వచ్చింది. పీకే వన్ ఇంక్లైన్‌లు మ్యాన్ రైడింగ్ ఏర్పాటు చేయాలని కోరడంతో యాజమాన్యం అంగీకరించింది. ఈ సందర్భంగా విమర్శించిన వాళ్ళు అభినందించారు. 2007లో పీకే టు ఇంక్లైన్ భూగర్భ గని మూసివేత గురైంది. కార్మికులను వివిధ ప్రాంతాలకు సింగరేణి యాజమాన్యం బదిలీ చేస్తుం డగా, బదిలీకి వ్యతి రకంగా కార్మికుల సహకారంతో ఉద్యమం నిర్వహించాం. దానికి యాజమాన్యం ఉద్యమానికి తలంచక తప్పలేదు. మణుగూరు లోనే కార్మికులను సర్దుబాటు చేసింది. కార్మికులు అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్మిక ఉద్యమం ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. ఐఎన్టియుసి నాయకుని పై మావోయిస్టులు దాడి చేస్తే ఆ ఘటన ఏఐటీయూసీ నాయకుడిగా ఉన్న నాపై అభియోగం మోపారు. మూడు నెలల తర్వాత పోలీసుల ఎంక్వయిరీలో భౌతిక దాడులు చేసే మనస్తత్వం నామా వెంకటేశ్వరరావుకు లేదని కేసును కొట్టివేశారు. మణుగూరు ఏరియా సింగరేణిలో అనేక మంది కార్మికులు వివిధ కారణాలు, తప్పిదాల వలన డిస్మిస్ అవుతున్న, డిస్మిస్ ఆయన కార్మికులను నామా వెంకటేశ్వరరావు యాజమాన్య దృష్టికి వస్తే వారి సమస్య పరిష్కరించి డిస్మిస్ కాకుండా చేసేవారు. దీని కారణంగా కార్మిక కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ఆయనకే దక్కుతుంది. అనేక ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కార్మికుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. నామా వెంకటేశ్వరరావు పదవి విరమణ విరమణ సందర్భంగా నవతెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆదర్శ వివాహం చేసుకున్న నామా వెంకటేశ్వరరావు ఆదర్శ జీవితాన్ని గడుపుతూ తుదకంటూ ఎర్రజెండా నీడలోనే జీవితం కొనసాగిస్తానని ఆయన తెలిపారు.