Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-బూర్గంపాడు
బీజేపీ మతోన్మాదాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పాపినేని సరోజన అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ మే డే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ ఆది వాసి గిరిజన సంఘం రాష్ట్ర 3వ మహాసభలు మే 5, 6 తేదీలలో భద్రాచలంలో జరుగుతుందని ఆయన అన్నారు. దీనికి పార్టీ మండల కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, మహిళా సంఘాలు, ప్రజలు అందరూ మే 5న సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలంలో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ సభకు ఢిల్లీ నుండి సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావు పాల్గొంటున్నారని ఆయన అన్నారు. గిరిజనులకు గత బడ్జెట్లో కేవలం 2.7 శాతం మాత్రమే నిధులు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. ప్రణాళిక సంఘం రద్దుతో ప్రణాళిక నిధులు కోల్పోయారని, నేటికీ విద్య, వైద్యం రంగాలలో కనీసం సౌకర్యాలు అందుబాటులో లేవని ఆయన అన్నారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 3 రద్దు వల్ల గిరిజనుల పోడు, ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని, పోడు భూముల పంపిణీలో 1/70 అమలులో ఉన్న ఆదివాసులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, భయ్యా రాము, రాయల వెంకటేశ్వర్లు, కందుకూరి నాగేశ్వరావు, కనకం వెంకటేశ్వర్లు, యార్లింకి అప్పారావు, బర్ల తిరపతయ్య, సీఐటీయూ నాయకులు నాగరాజు, సత్యనారాయణ, నాగులు, నరసింహారావు, నాగమణి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.