Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొడుకు కార్మిక పక్షపాతి
- అజాత శత్రువు
- కార్మిక నేత సామ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
ఉమ్మడి వరంగల్ జిల్లా పెదనాగరం గ్రామంకు చెందిన తన తండ్రి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలను ఎదిరించి జైలు పాలైనారు. జైల్లో అధికారులపై తిరగబడి గోడ దూకి చెరువులో ఈదు కుంటూ బయటపడ్డారు. 10 సంవత్సరాలు అజ్ఞాతవాసం గడుపుతూ పోరాటంలో పాల్గొన్నారు. అనంతరం అశ్వాపురం వలస వచ్చారు. రజాకారులు ఎదిరించిన ధీరత్వం, కొడుకు సామ శ్రీనివాస్ రెడ్డి ఆప్యాయతకు, అనురాగాలకు మారుపేరు మానవత్వానికి మంచితనానికి నిలువెత్తు నిదర్శనం నిస్వార్ధంగా కార్మికులకు సేవ చేస్తూ, ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ, కార్మిక పక్షపాతిగా, అజాతశత్రువుగా మణుగూరు మండల ప్రజలు, కార్మికుల హృదయాలలో స్థిర స్థాయిగా నిలిచిపోయే నాయకుడు సామ శ్రీనివాస్ రెడ్డి. సిరుల తల్లి సింగరేణి సంస్థలో 34 సంవత్సరాల 8 నెలల 20 రోజులు విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న సామా శ్రీనివాస్ రెడ్డికి నవతెలంగాణ ప్రత్యేక కథనం.
స్వగ్రామం అశ్వాపురం మండలం రామచంద్రాపురం తల్లిదండ్రులు బిక్షం రెడ్డి, సత్తెమ్మ విద్యాభ్యాసం నెల్లిపాక పాల్వంచలలో కొనసాగింది. ఐటిఐ పూర్తి అయిన తర్వాత 1989లో సింగరేణిలో ఎలక్ట్రిషన్‌గా ఉద్యోగంలో చేరారు. సుమారు 35 సంవత్సరాలు సీనియర్ టెక్నీషియన్ అనేక ప్రశంసలు పొందారు. మణుగూరు ఏరియాలో ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మించాలని, తన హాయంలోనే అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చానని దానిని సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. అంబేద్కర్ పార్క్‌కు వెలుగులు అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐఎన్టీయూసీలు క్రియాశీలక పాత్ర పోషించారు. వెంకట్రావు జన ప్రసాద్ సారధ్యంలో పనిచేశారు. ఐఎన్టీయూసీ ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుండి తెలంగాణ సాధించాలని కాంక్షతో ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శిగా వైస్ ప్రెసిడెంట్‌గా వివిధ పోరాటాలు నిర్వహించారు. ప్రస్తుతం స్టేట్ ఎలెవన్ నెంబర్ కమిటీ సభ్యుడిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి పై నమ్మకంతో అధికారులు అనేక సమస్యలు పరిష్కరించారాని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మణుగూరు ఏరియా కార్మికులకు అధికారులకు రుణపడి ఉంటానని తెలిపారు.