Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంగలి బోడ్, యర్రబోడ్, గ్రామాల్లో విస్తృత పర్యటన
నవతెలంగాణ-చండ్రుగొండ
గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. శుక్రవారం చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఎర్రబోడు, మంగలిబోడు, గ్రామాల్లోని వలస గొత్తి కోయాలకు నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గొత్తి కోయలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వల్ల తమ జీవితాలు అంధకారంలోకి నెట్టబడతాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులపై, ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడితే అట్టి వారిపై క్రిమినల్ కేసులతో పాటు బైండోవర్ కేసులు నమోదు చేస్తామని, నేర చరిత్రను బట్టి అవసరమైతే రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామన్నారు. అనంతరం ఫారెస్ట్ వాచర్ రాములుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన ప్రదేశాన్ని సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక ఎస్ఐను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి ఆదేశాల మేరకు ఆదివాసి గ్రామాలను సందర్శించి వారి జీవన విధానాన్ని, తెలుసుకొని. నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ వసంతకుమార్, చండ్రుగొండ, జూలూరుపాడు సబ్ ఇన్స్ స్పెక్టర్లు గొల్లపల్లి విజయలక్ష్మి, గణేష్, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.