Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవజాతికి మూలవాసులైన ఆదివాసి గిరిజన సంస్కృతి సంప్రదాయాలను నేటి సమాజానికి తెలియపరిచేందుకు ప్రపంచీకరణ మతోన్మాద శక్తుల వల్ల రోజు రోజుకి కనుమరుగవుతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను వాటి ప్రాముఖ్యతను ప్రత్యేకతను ప్రపంచానికి తెలియపరిచేందుకు భద్రాచలం వేదిక కాబోతుంది.
- మే 3, 4 తేదీల్లో ఆదివాసీ సాంస్కృతిక సంబురాలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
జెల్, జంగిల్, జమీన్, హమారా, నినాదంతో పోరాడే ఆదివాసి బిడ్డలు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు కావలసిన పోరాటాలను రూపొందించుకునేందుకు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలను భద్రాచలం పట్టణంలో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహాసభల సందర్భంగా ఆదివాసి కళలు సంస్కృతిని రక్షించుకోవాలన్న నినాదంతో ఆదివాసి సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున భద్రాచలం పట్టణంలో నిర్వహించేందుకు ఆ సంఘం సంసిద్ధమయింది. అందులో భాగంగా మే 3, 4 తేదీల్లో పట్టణంలోని జూనియర్ కాలేజ్ క్రీడా మైదానంలో ఆదివాసి సాంస్కృతిక ఉత్సవాలు 'రేలా పండుం నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగే ఈ సాంస్కృతిక ఉత్సవాలలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా వారి ఆటపాటలు డోలు కోయ నృత్యాలు రేలా డాన్సులులతో పాటు ఆదివాసీ నాటికలు నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని ఆదివాసీ ప్రాంతాల నుండి కళాకారులు, కవులు, గాయకులు, వాగ్గేయకారులు హాజరవుతున్నారు. అల్లూరు సీతారామరాజు నడివాడిన ఈ ప్రాంతం కుంజ బుజ్జి, సున్నం రాజయ్య, ముర్లఎర్రయ్య రెడ్డి, సోడే రామయ్య వంటి గిరిజన ఆణిముత్యాలని అందించిన భద్రాచలం ఏజెన్సీ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆదివాసి గిరిజన ప్రాంతం అనేక రకాల సాంస్కృతి సంప్రదాయాలకు అందాలకి నేలమైన ఈ ప్రాంతాన్ని పాలకులు కక్ష కట్టి ముక్కలు చేసి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను మాయం చేయాలని చేస్తున్న రాజకీయ కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల భద్రాచలంతో పాటు ఇతర ప్రాంత గిరిజనులు గిరిజన ఇతరులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరం యువకులకు తెలియని చూడని మూలమ ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను చూపించేందుకు ఆదివాసి గిరిజన సంఘం సంసిద్ధ మయింది. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ''రేలా పండుం'' ఆదివాసి సంస్కృతి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆదివాసి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం మూడు నాలుగు తేదీలలో జరిగే రేలా పండుగా భద్రాచల ఏజెన్సీ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది.