Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఇటీవల కురిసిన ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కె లకీëపురం, సున్నంబట్టి, కేశవపట్నం, లకీëనగరం గ్రామాలలో ఆకాల వర్షాలతో నష్ట పోయిన వరి, మిర్చి పంటలను రెవిన్యూ, వ్యవశాయ అధికారులతో కలసి పరీశీలించారు. వర్షాలతో నష్ట పోయిన రైతులను గుర్తించి పంట నష్టం అంచనా వేసి వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, తహశీల్దార్ ప్రతాప్, ఏఓ నవీన్కుమార్లతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంకా శ్రీనివాసరావు, నాయకులు బైరెడ్డి సీతారామారావు, పిలకా వెంకటరమణారెడ్డి, దర్శి సాంబశివరావు, కనుబుద్ది దేవా, తోటమళ్ల సంగీతరావు, ఉబ్బా వేణు, కోడి చంటి, కణితి సమ్మయ్య, లంకా శివ, గుమ్మడి శ్రీను తదితరులు ఉన్నారు.