Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మే' డేని విజయవంతం చేయాలి : కనకయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆధునిక స్వాతంత్రం భారత దేశంలోనూ మను ధర్మం అమలు చేయడమే ఎజెండాగా ఆరెస్సెస్ మూలాలు ఉన్న భారతీయ జనతా పార్టీ నేతగా మోడీ ప్రభుత్వ పాలన సాగిస్తున్నారని, అందుకే రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్వతంత్ర నిర్ణయాలతో అధికారం చెలాయిస్తూ సమాజాన్ని హిందూ మతం అవలంభించే దేశంగా మార్చడానికి ప్రభుత్వాధి నేతలు చూస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యుడు ముళ్ళగిరి గంగరాజు అధ్యక్షతన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ శుక్రవారం నిర్వహించిన పార్టీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్ రావు మాట్లాడుతూ భారతీయ లౌకిక తత్వానికి బీజేపీ మతతత్వంతో ప్రమాదం పొంచి ఉన్నందున భావ సారూప్య పార్టీలతో, బీజేపీ విధానాలకు వ్యతిరేకించే పార్టీలతో రాజకీయ ఒడంబడికతో తాత్కాలికంగా కలిసి పని చేయాలనే నిర్ణయాన్ని పార్టీ చేసిందని ఆయన తెలిపారు. ఒకే జాతి, ఒకే మతం నినాదం ప్రస్తుతం సమాజంలో సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏ పార్టీ అధికారం చేపట్టినా రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వం పాలించాలని, అంతే గానీ స్వంత జెండా ఎజెండాలుతో సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మే నెల 5న భద్రాచలంలో నిర్వహించే తెలంగాణ అటవీ ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ వెట్టిచాకిర విముక్తి, ఎనిమిది గంటలు పని విధానం అమలుకు కారణం అయిన మేడేని వాడవాడలా పతాకావిష్కరణ చేసి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. మత ఛాందసం, ఆదిమ కాలం ఆలోచనలతో ఆధునికతకు, అభివృద్ధి చెందిన సమాజాలుకు అపార నష్టం చేకూరుతుందని అందుకోసమే బీజేపీను రాష్ట్రం నిలువరించడానికి సూత్ర బద్దంగా రాజకీయాలు చేస్తున్నామని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, బి.చిరంజీవి, మండల కమిటీ సభ్యులు ముల్లగిరి గంగరాజు, గడ్డం సత్యనారాయణ, తగరం నిర్మల, మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం జగన్నాధం, నారం అప్పారావులు పాల్గొన్నారు.