Authorization
Sun April 27, 2025 03:58:44 am
నవతెలంగాణ - బోనకల్
దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాత పార్లమెంటులో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అమరజేవీ పుచ్చలపల్లి సుందరయ్య పేద ప్రజల కష్టజీవుల ఆశాజ్యోతి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు కొనియాడారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య జయంతి వేడుకలను సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుందర చిత్రపటానికి చింతలచెరువు కోటేశ్వరరావు దొండపాటి నాగేశ్వరరావు సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బిల్లా విశ్వనాథం, మచ్చ గురవయ్య, ఉప్పర శ్రీను, కార్మికులు బొబ్బిళ్ళ పాటి రాజు, బాదావత్ నాగేశ్వరరావు, బుక్య శ్రీనివాస్ రావు, గుగులోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.