Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించి, సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒక పక్క హెచ్చరిస్తుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం సెలవుల్లోనూ తరగతులు నిర్వహించాలనడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి.నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక యూటీఎఫ్ భవన్ లో సోమవార, జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. 10 రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలనడం సమంజసంగా లేద న్నారు. విద్యాశాఖ అధికారుల వైఖరి మార్చుకో వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యాశాఖ అధికారులు వింత పోకడలు పోతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. సెలవులు విద్యార్థులు కోసం ఇచ్చారని, పాఠశాలలు వెకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయని వారు పేర్కొన్నా రు. విద్యాశాఖ అధికారులు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కుటుంబ సంక్షేమ నిధి పథకం ప్రారంభం
మే 2న దాచూరి రామిరెడ్డి వర్ధంతి సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ - కుటుంబ సంక్షేమ నిధి పథకాన్ని నల్లగొండలో ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని తెలిపారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించామని, టీఎస్ యూటీఎఫ్ సభ్యులు అధిక సంఖ్యలో కుటుంబ సంక్షేమ నిధి పథకంలో సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసి విద్యారంగాన్ని కాపాడాలని ఆమె కోరారు. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను విడుదల చేసి, పీఆర్సీ ప్రకటించాలని కోరారు. ముందుగా మేడే సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షమీ, కోశాధికారి వల్లకొండ రాంబాబు, షేక్ రంజాన్, నరసయ్య, శ్రీకాంత్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.