Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామానికి చెందిన సిపిఎం మధిర రూరల్ మండల కార్యదర్శి మంద సైదులు తండ్రి మంద బాబురావు (56) బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆదివారం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబురావుకు ఈనెల 29వ తేదీన స్వగృహంలో రాత్రి సమయంలో గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మధిర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సలహా మేరకు ఖమ్మంలోనూ ప్రవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యులు సలహా మేరకు వెంటనే హైదరాబాదులోనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతుండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో వెంటనే మతి చెందాడు. ఆయన కుమారుడు మందా సైదులు అనేక ఏళ్లుగా ఎస్ఎఫ్ఐ, సిపిఎం లలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం మధిర రూరల్ మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. బాబురావు తన కుమారుడిని సిపిఎం నాయకుడిగా తయారు చేయడంలోనూ విశేషమైన కృషి చేస్తూ ప్రోత్సహించాడు. బాబురావు కూడా ఆళ్ళపాడు గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర నిర్వహించేవాడు. బాబురావు మృతదేహంపై సిపిఎం పతాకాన్ని పోతినేని సుదర్శనరావు కప్పారు. ఆళ్ళపాడు గ్రామంలో మృతదేహాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, బోనకల్, చింతకాని సిపిఎం మండలాల కార్యదర్శులు దొండపాటి నాగేశ్వరరావు, మడిపల్లి గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, ఆళ్ళపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు, మాజీ సర్పంచ్ పారా లక్ష్మీనారాయణ, రావినూతల ఎంపీటీసీ కందిమల్ల రాధ, సిపిఎం ఆళ్ళపాడు గ్రామ శాఖ కార్యదర్శి బండి నాగేశ్వరరావు, మాజీ కార్యదర్శి బండి నాగేశ్వరరావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెరుమాళ్ళపల్లి ప్రకాష్‌రావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్, సిపిఐ మాజీ మండల కార్యదర్శి బొమ్మినేని హనుమంతరావు తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.