Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
గ్రామపంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని సోమవారం చింతకాని మండల కేంద్రంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యదర్శుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, నాయకులు కొప్పుల గోవిందరావు, మడిపల్లి భాస్కర్, ఎంపీటీసీ బొర్ర ప్రసాద్, షేక్ మజీద్ ఆర్కే నాగార్జున బసవయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
రంగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు : మల్లు నందిని
జగన్నాధపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండేపూడి రంగయ్య మృతి పార్టీకి తీరని లోటని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పేర్కొన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన జగన్నాధపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండెపూడి రంగయ్య కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లునందిని సోమవారం పరామర్శించారు ఈ సందర్భంగా రంగయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రంగయ్య కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, నాయకులు భాస్కర్ బసవయ్య, ప్రసాద్, తోటకూర గోవిందరావు, అప్పారావు, తాళ్లూరు రమేష్, తన్నీరు పుల్లయ్య, ఆర్కె నాగార్జున తదితరులు పాల్గొన్నారు.