Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై ధర్నా
- జాయింట్ కలెక్టర్ హామీతో ధర్నా విరమించిన రైతులు
నవతెలంగాణ-కూసుమంచి
శనివారం కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పలు గ్రామాలలో అదనంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం- సూర్యాపేట నేషనల్ హైవేపై(జుజ్జుల్ రావు పేట గ్రామం దగ్గర) సుమారు గంటన్నర పైగా రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వం గ్రామాలలో ఐకెపి, సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు ఏ గ్రామాల్లో కూడా సొసైటీల, ఐకెపి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని, ఒకటి రెండు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన వాటి ద్వారా రైతుల పంటను కొనుగోలు చేయలేదని, దీంతో పలు గ్రామాల్లో ఎక్కడే పడితే అక్కడ ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా కనబడుతున్నాయని, అకాల వర్షాలతో పంట మొత్తం తడిసి మొలకలు ఎత్తుతున్నాయని, దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి, సొసైటీ పోలీస్ అధికారులు ధర్నా దగ్గరకు చేరుకొని ధర్నాను విరమించుకోవాలని పలుమార్లు రైతు నాయకులను, రైతులను పలుమార్లు కోరిన వారు ధర్నాను విరమించలేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ హామీతో ధర్నా విరమణ చేశారు. ఫోన్ లో రైతు సంఘం నాయకులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలో తక్షణమే సొసైటీలు ఐకెపి కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు చేస్తామని, అలాగే అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేస్తుందని, అదనంగా లారీలను సాయంత్రం వరకు ఏర్పాటు చేసి ధాన్యంను మిల్లులకు తరలిస్తామని ఫోన్లో రైతన్నకు, రైతు సంఘం నాయకులకు జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో నాయకులు ధర్నాను విరమించారు. దీంతో రైతులు, రైతు సంఘం నాయకులు నాయకులు సిపిఎం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు మల్లెల సన్మతరావు, శీలం గురుమూర్తి, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తోటకూరి రాజు, బిక్కసాని గంగాధర్, మండల కమిటీ సభ్యులు తాళ్లూరి వెంకటేశ్వరావు, కర్ణబాబు, జానయ్య, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సభ్యులు వెన్ను ఉపేందర్ చీర్ల రాధాకృష్ణ, పందిరి వీరారెడ్డి, వెంకన్న, గడ్డం మురళి, లిక్కి లింగయ్య, వెంగళరావు, వేణు, జగదీష్, చక్రి, శీను, మండలంలోని పలు గ్రామాల నుండి రైతులు పాల్గొన్నారు.