Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలో సోమవారం ఉదయం కురిసిన వర్షానికి గోళ్లపాడు, కస్నాతండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసింది. కస్నాతండాలో ధాన్యం రాశుల చుట్టూరా వర్షపు నీరు నిలిచింది. రైతులు తడిసిన ధాన్యాన్ని ప్రధాన రహదారిపై ఆరబెట్టారు. సకాలంలో కాంటాలు వేయకపోవడం, టార్పాలీన్లు లేకపోవడం వల్ల ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని సిపిఎం నాయకులు పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఖమ్మం రూరల్ మండల నాయకుడు పొన్నం వెంకటరమణ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను ఎలాంటి తరుగూ లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు అద్దంకి తిరుమలయ్య, భూక్య నాగేశ్వరరావు, ఊరు బండి చంద్రయ్య, కారుమంచి గురవయ్య, పొన్నం మురళి, నాగుబండి రవి తదితరులు పాల్గొన్నారు.