Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బ్రహ్మాచారి
నవతెలంగాణ-చర్ల
ప్రజల తరఫున నిరంతరం పోరాడుతున్నది ఎర్రజెండా ఒక్కటేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి తెలిపారు. 137 మే డే సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యాలయం బిఎస్ రామయ్య భవన్లో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు అధ్యక్షతన జరిగిన సభలో బ్రహ్మచారి మాట్లాడారు. దోపిడీ ఉన్నంతకాలం దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ఎర్రజెండా ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నా రు. సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగానే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి సాధిం చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కుల పైన దాడి చేస్తుందని విమర్శించారు. మేడే సందర్భంగా మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్, మండల కమిటీ సభ్యులు ఈ.సమ్మక్క, తాటి నాగమణి, బందెల చంటి, చర్ల మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ దొడ్డి హరినాగ వర్మ, సుబ్బంపేట సర్పంచ్ ఏకా సుజాత, పార్టీ ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రంలో సీఐటీయూతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో
సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో మేడే జెండాను కే.బ్రహ్మాచారి ఆవిష్కరించారు. అనంతరం భారీ ప్రదర్శన, ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో బ్రహ్మచారి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఐక్యతకు పోరాటాలకు మేడే మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్న వీవోలను ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలన్నారు. మండల వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో 10 కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్, సీఐటీ యూ మండల కమిటీ సభ్యులు శ్రీ గణేష్ ఆటో యూనియన్ ప్రెసిడెం ట్ శ్రీ బాలాజీ ఆటో యూనియన్ కార్యదర్శి సంపత్, వీవోఏ యూని యన్ అధ్యక్షురాలు ఇరుప అనురాధ, కార్యదర్శి మీనా, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు పాలెం నాగ మణి, మిషన్ భగీరథ యూనియన్ కార్యదర్శి సోడి పృద్వి, మధ్యాహ్న భోజన కార్మికులు యూనియన్ నాయకురాలు శ్యామల సమ్మక్క, సీఐటీయూ నాయకులు విజయలక్ష్మి, స్వరూప, వ్యకాస నాయకులు మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ హరి నాగ వర్మ, కేవీపీఎస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు తదితరులు పాల్గొన్నారు.