Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
రాజ్యాంగం ప్రకారం తమకు వర్తించవలసిన హక్కుల కోసం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న పోరాటానికి మండల పరిధిలోని రాచన్నగూడెం పంచాయతీ సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా చెందిన సర్పంచ్ కొర్సా గణపతి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, మల్టీ వర్కర్స్ స్థానికులు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు శుక్రవారం సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి జూనియర్ సెక్రటరీలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొర్సా గణపతి మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్, వార్డ్ సభ్యులు పద్దం రాఘవులు, ఊకె విజయ, కుంజా ప్రభు కుమార్, మడివి గంగా భవానీ, మల్టీ వర్కర్స్ గడ్డం నాగరాజు, పద్దం పాపారావు, కుంజా సత్యనారాయణ, రవి, వగ్గెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.