Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటింటికీ తడి..పొడి చెత్త బుట్టలు
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పురపాలకం సర్వాం సుందరంగా మారాలని, చెత్త లేని గూడెంగా ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ కార్యాయంలో మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తడి చెత్త పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ, కొత్తగూడెం పట్టణంలో ఉన్న 36 వార్డులలో పారిశుద్ధ్య పనులు, తడి చెత్త పొడి చెత్త నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని మునిసిపల్ పారిశుధ్య సిబ్బందికి, అదేవిధంగా మెప్మా సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలోని మునిసిపల్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి తడి పొడి చెత్త బుట్టలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని, బుట్టల పంపిణీ పారదర్శకంగా సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దామోదర్ స్థానిక కౌన్సిలర్ అప్జలున్నిషా బేగం, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కోలాపురి ధర్మరాజు, కౌన్సిలర్లు బాలశెట్టి సత్యభామ, రుక్మాంగధర్ బండారి, పరమేశ్ యాదవ్, పల్లపు లక్ష్మణ్, తంగేళ్ల లక్ష్మణ్, మోరే రూప, విజయలక్ష్మి, విమల, వేణు, శ్రీను, జమలయ్య, తదితరులు పాల్గొన్నారు.