Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జి.శ్రీనివాస్
నవతెలంగాణ-చండ్రుగొండ
క్షయ వ్యాధిని నివారించవచ్చునని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆశ డే కార్యక్రమం మండల ప్రాథమిక వైద్యులు కనకం తనుజ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ వ్యాధి మందులు వేసుకునే విధానం గురించి క్షుణ్ణంగా వివరించారు. వ్యాధి గ్రస్థు లకు న్యూట్రిషన్ కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీ ఎంఓ వెంకటేశ్వర్ రావు, స్టాఫ్ నర్స్ శంకరమ్మ, హెల్త్ సూపర్ వైసర్లు ఇమామ్, చంద్రకళ, ల్యాబ్ అసిస్టెంట్ కిరణ్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.