Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడే వారోత్సవాలు సందర్భంగా కళ్యాణం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి కోటి ఉద్యోగాలు తీసివేసే పనిలో మోడీ ప్రభుత్వం ఉందని సీఐటీయు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. సీఐటీయు ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సీఐటీయు జెండా ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందని వారన్నారు. నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు పరితపిస్తున్నారు అని తెలిపారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తారా స్థాయికి చేరాయని, వాటిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. అదానీ, అంబానీలకు ఈ దేశాన్ని అమ్మే పనిలో మోడీ ప్రభుత్వం వుంది అని ఆరోపించారు. మోడీ విధానాలు ఫలితంగా దేశంలో మత కల్లోలాలు పెరిగాయని ఆరోపించారు. కార్మికుల హక్కుల విషయంలో రాజీ పడి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో సవరణలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై విక్రమ్, బోడపట్ల సుదర్శన్, కాంపాటి వెంకన్న, ఉపేంద్ర, నాగరాజు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.