Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వ కాలయాపనతో కొనుగోలు కేంద్రాల్లో అకాలవర్షాలకు తడిచిన ధాన్యాన్ని టీపిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డితో కలిసి కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ కమిటి నాయకులు పరిశీలించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆరుగాలం పాటు కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన వేళ మంచి గిట్టుబాటు ధరతో ధాన్యాన్ని అమ్మి వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చి కుటుంబంతో ఆనందంగా గడపాలనుకొన్న రైతుల ఆశలు అకాల వర్షాలకు అడియాశలు అయ్యాయన్నారు. ఇటువంటి పరిస్థితులలో రైతులు బాధతో పుట్టెడు దుఃఖంలో ఉంటే ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఇప్పటికే పంటకోసం తీసుకొన్న వ్యవసాయ రుణాలు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసంచేసి నట్టేట ముంచారు. గత 15రోజులుగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్య ధోరణితో కాలయాపన చేయడం వల్ల అకాలవర్షాల కారణంగా ధాన్యం మొత్తం తడిచిపోయిందని దళారులు ఇదే అదునుగా భావించి ధాన్యంలో భారీగా తరుగు తీయడంతో పాటు కాటా ఖర్చులు కూడా రైతుల నుండి వసూలు చేస్తూ అందినకాడికి దండుకుని రైతుల నడ్డి విరుస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ డెపార్టుమెంట్ కన్వీనర్ కొండూరు కిరణ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కీసర శ్రీనివాస రెడ్డి, ఎంపిటిసి మాదిరాజు లక్ష్మణరావు, మాజీ ఎంపిపి గోపాలస్వామి, మండల బీసీ సెల్ నాయకులు గుండ్ల పుల్లారావు, మండల ఎస్సీ సెల్ నాయకులు లింగపోగు కృష్ణ, తోట జనార్ధన్, జినుగు భాస్కర్ రావు, తెళ్లురి కృష్ణ, మేకల ప్రసాద్, బొడ్డు కృష్ణ, కల్లేపళ్లి రమేష్, పోతురాజు నరేంద్ర, రమేష్ తదతరులు పాల్గొన్నారు.