Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడేండ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి కావడం లేదు
- జెడ్పీ స్టాండింగ్ సమావేశంలో జెడ్పీ చైర్మెన్ కోరం
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో రెండు పడకల ఇండ్లు ఎందుకు పూర్తి కావడంలేదని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య సంబంధిత ఏటిడిఏ అధికారులను ప్రశ్నించారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 7 జిల్లా స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఆర్ధిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ది, విద్య వైద్యం,పనులు తదిత స్థాయి సంఘంలకు జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య అధ్యక్షతన, వ్యవసాయం, స్థాయి సంఘ కమిటీకి వైస్ చైర్ పర్సన్ కంచెర్ల చంద్రశేఖర్ రావు, అధ్యక్షులుగా, మహిళా స్థాయి సంఘం కమిటీ జెడ్పిటీసీ లావుడ్యా బిందు చౌహన్ అధ్యక్షులుగా, సాంఘీక సంక్షేమం జెడ్పీటీసీ భూక్య కళావతి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో చైర్మెన్ కోరం కనకయ్య మాట్లాడుతూ, ఒక్క రేషన్ షాపు మూడు గ్రామములకు పని చేస్తున్నందున కొత్త రేషన్ షాపుల టెండర్లు ప్రభుత్వం వారు నోటిపికేషన్ విడుదల వెలువడిన తక్షణమే కొత్త రేషన్ షాపుల టెండర్లకు పిలుస్తామని తెలిపారు. ఏజన్సీ ప్రాంతాల్లో రెండు పడలకల ఇండ్ల నిర్మాణాలు నత్తనడకల సాగుతున్న తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్ అందుతున్నాయని, పెన్షన్ రాని వారు దరఖాస్తు చేసి వెంటనే అర్హులకు పెన్షన్ మంజూరికై సంబందిత శాఖ ద్వారా ప్రభుత్వం అనుమతికి పంపబడునని తెలిపారు. ఆయిల్ పామ్ తోటల పెంపకముకై రైతులు పట్టాదారు పాస్ పుస్తకం కలిగియుండి, బోరు, కరెంట్ వసతులు కలిగియున్న ప్రతియొక్క రైతు ఆయిల్ పామ్ తోట సాగు చేసుకోవచ్చని, ఎకరానికి రూ.1140లు డి.డి. ఇప్పుడు తీసిన యెడల జూన్, 1వ తారీకు నుండి ఆయిల్‌పామ్ మొక్కలు పొందవచ్చు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమము ఈ నెల చివరి వారంలో ముగుస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమము విజయ వంతముగా నడుస్తుందన్నారు. ప్రజా ఆరోగ్య కేంద్రములో (54) రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఉన్నాయని తెలిపినారు. జిల్లాలోని 22 వసతి గృహాలలో ఆర్వోప్లాంట్స్ పెట్టడం జరిగినదని తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి 2022-23 విద్యా సంవత్సరమునకు ఐదుగురు విద్యార్థిని, విద్యార్థులు ఎంపిక కాబడినారని తెలుపుతూ, అందుకు రూ.70,02,884లు విడుదల కావడం జరిగినదని రూ.65,47,690లు మంజూరీ చేయడం జరిగినదని సభకు తెలిపినారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జెడ్పీ సీఇఓ మెరుగు విద్యాలత, డిప్యూటీ సీఇఓ బి. నాగలక్ష్మి, జిల్లా వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.