Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏజీఎస్ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు రవివర్మ
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆదివాసి చట్టాలపై రెవెన్యూ అధికారులకు కనీస అవగాహన కొరవడుతుందని టీఏజీఎస్ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు రవివర్మ అన్నారు. రాష్ట్ర మూడో మహాసభలను ఉద్దేశించి శనివారం ఆయన ప్రసంగించారు. పీసా, 1/70 చట్టాలపై అవగాహన కొరవడిందని తెలిపారు. ఐటీడీఏ నిర్వీర్యమై పోతుందన్నారు. 1/70 చట్టాన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులకు అవగాహన లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. మధుర ఆ చట్టం మెటీరియమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ఆన్ లైన్ పర్యవేక్షణ సరి కాదని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆదివాసి విద్యను ప్రోత్సహించాలని కోరారు. ఆరోగ్యం విషయంలోనూ ఆదివాసీల పట్ల నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. పీసా గ్రామ సభల్లో టిఏజిఎస్ కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు.