Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆదివాసి ఉనికి, సంస్కృతిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ దాడి చేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. టీఏజీఎస్ రాష్ట్ర మహాసభలకు ట్రేడ్ యూనియన్ తరఫున శనివారం సౌహార్థ సందేశమిచ్చారు. కార్మికులు, ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందన్నారు. అభివృద్ధి పేరుతో నష్టపోవాల్సి వస్తే ఆదివాసీలే ముందు వరుసలో ఉంటున్నారని తెలిపారు. అన్ని రకాల దోపిడీకి వ్యతిరేకంగా సీఐటీయూ పోరాడుతుందని చెప్పారు. ఆదివాసీ సంస్కృతి, ఉనికిపై ఆర్ఎస్ఎస్, బిజెపి దాడి చేస్తున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 3 రద్దును నిరసిస్తూ ఆందోళనలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వనవాసి కళ్యాణ పరిషత్, ఆదివాసి మోర్చా పేరుతో ఆదివాసీ సంస్కృతిని రూపుమాపే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తుందన్నారు. పోరాట యోధుడు కొమురం భీమ్ నినాదం 'జల్-జంగిల్-జమీన్-హమారా' స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.