Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని అభివృద్ధి సాధించింన్నారు. పట్టణ ప్రగతి, తర పథకాల ద్వారా కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. నిధులను ఉపయోగించుకొని పాలకవరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో ఇల్లందు మున్సిపాలిటీ పేరు ప్రతిష్టలు అవార్డులు సాధించడంలో ఎంతో కృషి చేసిందన్నారు. పాలకులంతా ఐక్యంగా కలిసికట్టుగా ఉంటూ మరింత అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
అభ్యంతరాల మధ్య 64 అంశాలకు కౌన్సిల్ ఆమోదం
మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో 64 అంశాలపై చర్చించారు. ఎజెండాలోని అంశాలు చదువుతుండగా కొందరు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేసి గలాభా సృష్టించినట్లు తెలిసింది. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ ఆదేశాలతో సద్దుమణిగినట్లు సమాచారం. అనంతరం 64 అంశాల మీద కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ డివి, వైస్ చైర్మన్ జానీ, పురపాలక సంఘ కౌన్సిలర్స్ ఆమోదం తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ అంకూషావళి, డీఈ, ఏఇ, సిబ్బంది పాల్గొన్నారు.