Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం ఎస్బిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో గత 6 రోజుల నుండి బి.టెక్, విద్యార్థులకు కోడ్ తంత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ కోర్సు పైథాన్ ప్రోగ్రామ్ -శిక్షణా కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు పైథాన్ ప్రోగ్రాంపై సర్టిఫికెట్ తో కూడిన శిక్షణ అందించటం జరిగిందని, ప్రస్తుతం ఫైధాన్ ప్రోగ్రాం ఆవశ్యకత అన్ని రంగాలలో ఉండటం జరుగుతుందని, విద్యార్థులకు ఫైధాన్ పై సమగ్ర అవగాహన అవసరం అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఫైధాన్ ప్రోగ్రామింగ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దానికి అనుగుణంగా విద్యార్థులు ఫైథాన్ ప్రోగ్రాంపై పూర్తి అవగాహన అవసరం అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి. రాజ్‌కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ గంధం శ్రీనివాసరావు, ఎకడమిక్ డైరెక్టర్స్, ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, జి. సుభాష్ చందర్, జె.రవీంద్రబాబు. హెచ్ అండ్ ఎస్. హెచ్.ఒ.డి. నాగలక్ష్మి, టిపిఓలు ఎన్.సవిత, ఎ.మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.